తమిళనాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజ్ మోహన్... విజయ్ నిర్ణయాన్ని తప్బుబట్టిన విశాల్!
- తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయంపై నటుడు విశాల్ బహిరంగ విమర్శ
- సినిమా శాఖను అనుభవం లేని రాజ్‌మోహన్‌కు ఇవ్వడంపై అసంతృప్తి
- ఈ శాఖను సీఎం విజయ్ స్వయంగా చూసుకోవాలని విశాల్ సూచన
"సీఎం జోసెఫ్ విజయ్ మంత్రులకు శాఖలు కేటాయించడం సంతోషంగా ఉంది. కానీ, ఫిల్మ్ టెక్నాలజీ మంత్రిగా రాజ్‌మోహన్‌ను నియమించడం నిరాశపరిచింది," అని విశాల్ పేర్కొన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాజ్‌మోహన్‌కు పెద్దగా అనుభవం లేదని, దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న సీఎం విజయ్ ఈ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తాను రాజ్‌మోహన్‌ను కించపరచడం లేదని, ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా విశాల్ ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకురావాలని, "ఒకే దేశం-ఒకే పన్ను" విధానం ప్రకారం సినిమాలపై స్థానిక సంస్థల పన్నును రద్దు చేయాలని, చిన్న సినిమాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని కోరారు.