అమీర్ ఖాన్ '3 ఇడియట్స్-2' వస్తోంది.. కథపై సస్పెన్స్!
- బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ '3 ఇడియట్స్' సీక్వెల్‌కు రంగం సిద్ధం
- మళ్లీ కలవనున్న ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి
- సీక్వెల్ కథలో భారీ టైమ్ లీప్ ఉంటుందని సమాచారం
- అయితే ఇది సీక్వెలా, ప్రీక్వెలా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్
- ఒరిజినల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీనే దర్శకత్వం వహించే అవకాశం
ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్ కథలో ఒక భారీ టైమ్ లీప్ ఉండనుంది. అంటే, 2009 నాటి సినిమాలో కనిపించిన పాత్రల జీవితంలోని మరో దశను ఇందులో చూపించబోతున్నారు. అయితే, ఈ కథలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఈ కథ మొదటి భాగం తర్వాత కొనసాగుతుందా లేక దానికంటే ముందు జరిగిన కథా (ప్రీక్వెల్) అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ కథాంశం గురించిన పూర్తి వివరాలు ప్రస్తుతం ఆమిర్ ఖాన్‌కు మాత్రమే తెలుసని చెబుతున్నారు.
2009లో రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన '3 ఇడియట్స్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి, రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆమిర్ ఖాన్ పోషించిన 'రాంచో' పాత్ర ఇండియన్ సినిమాలో ఐకానిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్, బోమన్ ఇరానీ, మోనా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు సీక్వెల్‌కు కూడా రాజ్‌కుమార్ హిరాణీనే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.