ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్
- ప్రభాస్ గురించి జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానంపై అప్పట్లో దుమారం
- ఒక్క మాటను పట్టుకుని రాద్ధాంతం చేశారన్న నిత్యామీనన్
- ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి
ఆ సమయంలో తాను చాలా అమాయకంగా ఉండేదానని, ఒక్క మాటను పట్టుకుని రాద్దాంతం చేయడం తనను చాలా ఇబ్బందికి గురిచేసిందని అన్నారు. తన నిజాయతీని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఈ విషయాన్ని పెద్దది చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండడం పనికిరాదన్న విషయం అర్థమైందని వెల్లడించారు.
కొన్నిసార్లు తెలివిగా మాట్లాడటం అవసరమని తాను తెలుసుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు తన నిజాయతీకి అర్హులు కారని అర్థమైందని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత తాను లోకజ్ఞానాన్ని పెంచుకున్నానని అన్నారు. నాడు ప్రభాస్ అంశం కారణంగా తాను ఎంతో ఇబ్బందిపడ్డానని వాపోయారు.
దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి, తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఆ సమయంలో కొన్ని ఫేక్ ఫొటోలు సృష్టించి తనను మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి ఘటనలు తనకు జీవితంలో ఎంతో నేర్పాయని, అప్పటి నుంచి తాను మనుషులను అంచనా వేయడంలో చాలా మారిపోయానని వెల్లడించారు.