ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా, సాధారణ ట్రాఫిక్‌లో రేవంత్ కాన్వాయ్ ప్రయాణం... వీడియో ఇదిగో!
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లో కాన్వాయ్
- ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయకుండా ఒకే లైన్లో వాహనాలను కదలడానికి అనుమతి
- తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టవద్దని రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశాలు
ఈ క్రమంలో గురువారం ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించింది. విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే వెళ్లడం గమనార్హం. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడానికి బదులు ఒక లైన్లో వాహనాలను అనుమతించాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో, పోలీసు అధికారులు ఈరోజు దానిని పాటించారు. ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా పోలీసులు వాహనాలను ఒకే లైన్లో కదలడానికి అనుమతించారు.