కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు.. ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు: కేటీఆర్
- రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపణ
- కాంగ్రెస్ అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపాటు
- బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్న కేటీఆర్
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పుడు చేతులెత్తేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. నిన్న మోదీ ప్రభుత్వం వాణిజ్య సిలిండర్‌పై సుమారు రూ.993 పెంచిందని, ప్రజా వ్యతిరేక విధానాలకు ఇదే నిదర్శనమని అన్నారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.