కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు
- కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం
- హ్యామ్ రోడ్లకు టెండర్లు వేసిన వారిని బెదిరిస్తున్నారని ధ్వజం
- బీఆర్ఎస్ నాయకులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శ
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. వివిధ శాఖలు, ప్రాజెక్టులపై అనవసర ఆరోపణలు చేసి కాంట్రాక్టర్లను లొంగదీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్‌కు కేటీఆర్, హరీశ్ రావులు బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. రాజకీయ అస్తిత్వం కోసమే వారిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.