వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య
- హైదరాబాద్లోని కూకట్పల్లిలో విషాద ఘటన
- మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల
- ఉరివేసుకుని భర్త, విషం తాగి భార్య బలవన్మరణం
ఈరోజు ఉదయం వారు ఉన్న ఇంటి తలుపు ఎంతసేపటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్ళి చూశారు. భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉండటాన్ని గమనించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.