అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట
- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- విదేశీ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అసోం సీఎం భార్య
- పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరిన పవన్ ఖేరా
తనకు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణలపై రిణికి భూయాన్ శర్మ గౌహతిలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పవన్ ఖేరా అభ్యర్థించగా, గౌహతి హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.