కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!
- కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం
- 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)గా పార్టీ పేరు ఖరారు
- మొదట 'తెలంగాణ రాష్ట్ర సేన'గా ప్రకటించిన కవిత
- బంజారాహిల్స్‌లోని నివాసంలో కవితకు లేఖ అందజేసిన అధికారులు
ఈ నెల 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సభలో పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన'గా వెల్లడించారు. అయితే, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా 'తెలంగాణ రక్షణ సేన' పేరుకు ఆమోదం తెలిపింది.
ఈ పేరును కవితకు కేటాయిస్తున్నట్లు ధృవీకరిస్తూ ఎన్నికల సంఘం పంపిన లేఖతో, ఆమె పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక కీలక ఘట్టం పూర్తయింది. ఈ అధికారిక ఆమోదంతో కవిత తన రాజకీయ కార్యకలాపాలను 'తెలంగాణ రక్షణ సేన' పేరుతో ముందుకు తీసుకెళ్లనున్నారు.