హెచ్‌సీఏ అక్రమాలపై హైకోర్టు సీరియస్.. సిట్ దర్యాప్తునకు ఆదేశం
- సీబీసీఐడీలోని సిట్‌తో విచారణ జరపాలని స్పష్టం
- జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ పాలన
- అవినీతి జరిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్య
హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీఏకు స్వయం ప్రతిపత్తి ఉన్నంత మాత్రాన న్యాయవ్యవస్థ పరిధి నుంచి తప్పించుకోలేదని తేల్చి చెప్పారు. అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు పారదర్శకత కోసం కోర్టులు కచ్చితంగా జోక్యం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
దర్యాప్తునకు హెచ్‌సీఏ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో హైదరాబాద్ క్రికెట్ సంఘంలోని వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.