కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై పవర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్!
- ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన రామ్ చరణ్
- చరణ్‌ను గ్లోబల్ ఫోర్స్ అంటూ అభివర్ణించిన పత్రిక
- హాంగ్‌కాంగ్‌లో ప్రత్యేకంగా జరిగిన ఈ ఫోటోషూట్
- ‘పెద్ది’ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హాజరైన చరణ్
"రామ్ చరణ్ సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ, ఆయన్ను మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో మా కవర్‌పై ఆవిష్కరిస్తున్నాం" అని ఎస్క్వైర్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఈ ఫోటోషూట్‌ను ప్రత్యేకంగా హాంకాంగ్‌లో నిర్వహించినట్లు సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకుని ఆయన హాంకాంగ్‌లో జరిగిన ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. విశేషమేమిటంటే, ‘పెద్ది’ సినిమా కోసం మెయింటైన్ చేస్తున్న హెయిర్‌స్టైల్‌తోనే ఆయన ఈ షూట్‌లో కనిపించారు. దీంతో ఆయన లుక్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.