‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్
- ప్రశాంత్ నీల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న తారక్
- కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్
- ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో సినిమా
- త్వరలోనే ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం
ఈ ఫొటోకు "కొన్నది కాదు.. కష్టపడి సంపాదించింది" (#BuiltNotBought) అని ఎన్టీఆర్ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందోనన్న అంచనాలు మరింత పెరిగాయి. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్ కూడా నటించనున్నారని సమాచారం. 1969 కాలంలో భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో జరిగే ఎమోషనల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.