'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన
- కోలీవుడ్ హీరో విజయ్ 'జన నాయగన్' చిత్రానికి లీకుల బెడద
- ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి
- సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న చిరు
- నిర్మాణ సంస్థకు అండగా ఉంటామని ప్రకటన
- పైరసీని అంతం చేయాలని సోషల్ మీడియాలో పిలుపు
"నమ్మకం, ఎంతో మంది సమష్టి కృషి, కలల మీద సినిమా నిర్మాణం ఆధారపడి ఉంటుంది. 'జన నాయగన్' లీక్ కావడం నన్ను ఎంతగానో ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి ఘటనలు చిత్ర పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన సృజనాత్మకతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తాయి" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తాము అండగా ఉంటామని చిరంజీవి స్పష్టం చేశారు. సినిమాను గౌరవించుకోవడానికి, పరిరక్షించుకోవడానికి మనమందరం మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. "పైరసీని చంపేద్దాం.. సినిమాను బతికిద్దాం" అంటూ తన పోస్టును ముగించారు.