ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
- అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడి
- రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రుల దౌర్జన్యం
- ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమంటూ మండిపడ్డ సీఎం
నాటి ప్రభుత్వ కుట్రలను, వేధింపులను తట్టుకుని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహా ఇతర మీడియా సంస్థలు నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని గుర్తుచేశారు. దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పత్రికను, ఛానెల్‌ను నడుపుతున్నారన్నారు. దాడులు, నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా మహిళల పట్ల, సొంత కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరును మహిళా సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.