ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన.. వీడియో ఇదిగో!
- ఆర్కే వీకెండ్ కామెంట్ కథనంపై వైసీపీ శ్రేణుల నిరసన
- ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి యత్నం
- మావిగన్ వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకేనని విమర్శలు
- అపోలో ఆసుపత్రి రోగులకు తీవ్ర అసౌకర్యం
ఏపీ మహిళలను అవమానించారంటూ రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఆఫీసును ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆఫీసు వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తప్పలేదు. సమీపంలోనే అపోలో ఆసుపత్రి ఉండడంతో చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు. నిరసనకారులు వైసీపీ నేత అంబటి రాంబాబు నేతృత్వంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది.