డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- విజయవాడలో ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరు
- ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ పిల్లల నూతన వస్త్రధారణ వేడుకలో లోకేశ్ సందడి
- సాయి సీతారామ్, లక్ష్మీ కుసుమలను ఆశీర్వదించిన లోకేశ్
- వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి లోకేశ్
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో డూండి రాకేశ్ కుమారుడు సాయి సీతారామ్, కుమార్తె లక్ష్మీ కుసుమలను మంత్రి నారా లోకేశ్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన వేడుకకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి లోకేశ్ కార్యక్రమానికి హాజరవ్వడంపై డూండి రాకేశ్ కుటుంబం, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. పిల్లలిద్దరినీ ఆశీర్వదిస్తున్న చిత్రాలను ఆయన పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.