సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
- కోహెడ పండ్ల మార్కెట్ భూములపై సీఎం కన్నుపడిందని ఆరోపణ
- భూములు కనిపిస్తే అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం
- ప్రభుత్వం రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసం కాదని విమర్శ
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వాలు రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసం కాదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ భూసేకరణలో భాగంగా రూ.10 కోట్లు రైతులకు ఇప్పించామని, కోహెడలో ప్రపంచ అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ కట్టాలని భావించామని తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్ తయారు చేశామని, వందేళ్లను దృష్టిలో పెట్టుకుని మార్కెట్కు రూపకల్పన చేసినట్లు తెలిపారు.