విమాన సేవలను పునఃప్రారంభించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొనసాగుతున్న విమానాల రద్దు
- అబుదాబికి సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ వెల్లడి
- దోహా, రియాద్, కువైట్ ప్రాంతాలకు ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్న నిలిపివేత
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సేవల్లో తీవ్ర అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ లైన్స్ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి, కోజికోడ్ ప్రాంతాలకు విమాన సేవలను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని వెల్లడించింది.