తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్ నిర్మాణంలో సినిమా
- సుకుమార్ నిర్మాతగా నూతన చిత్రం
- హీరోగా నటించనున్న ప్రియదర్శి
- బన్నీవాస్‌తో, సుకుమార్ సంయుక్త నిర్మాణం
ఇక త్వరలో మరో తెలంగాణ నేపథ్య కథతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సంస్థపై చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషఖర్మ, రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సుకుమార్, నిర్మాత బన్నీవాస్‌లు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
'బలగం' ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ చిత్రం తెలంగాణ నేపథ్య కథతో రూపొందనుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా ఓ నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. దర్శకుడిగా స్టార్స్‌తో పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్, నిర్మాతగా కూడా ఇలాంటి కథలతో చిన్న సినిమాలు నిర్మించడం నిజంగా ప్రశంసనీయం.