తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ
- తేయాకు తోటను సందర్శించి మహిళా కార్మికులతో కలిసి ఆకులు కోసిన వైనం
- గోగముఖ్లో జరిగిన బహిరంగ సభకు హాజరు
- అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా
- రాహుల్ గాంధీకి వందోసారి ఓటమి తప్పదని వ్యాఖ్యలు
బహిరంగ సభలో రాహుల్ గాంధీపై విమర్శలు
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోగముఖ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అసోంలో బీజేపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి వందోసారి ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు.
అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. అసోంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు.