"ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్".. శర్వా 'బైకర్'కు ప్రభాస్ ప్రమోషన్.. వీడియో ఇదిగో!
- యంగ్ హీరో శర్వానంద్ సినిమాకు ప్రభాస్ మద్దతు
- 'బైకర్' చిత్రం కోసం బైక్ నడిపి ప్రమోషన్
- శర్వానంద్ తమ ఇంటి హీరో అని వ్యాఖ్య
- ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న 'బైకర్'
- ప్రభాస్ వీడియోను షేర్ చేసిన యూవీ క్రియేషన్స్
శర్వానంద్ తనకు అత్యంత ఆప్తుడని ప్రభాస్ ఈ సందర్భంగా తెలిపారు. "శర్వానంద్ మా ఇంటి హీరో. నిర్మాతలు ప్రమోద్, వంశీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్" అని ఆయన పేర్కొన్నారు. సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభాస్ స్వయంగా ప్రచారం కల్పించడం విశేషం.
ఈ వీడియోను యూవీ క్రియేషన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. "పండగలా దిగివచ్చాడు. ఈ మద్దతు మాకు ఎంతో విలువైంది" అంటూ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏప్రిల్ 3న 'బైకర్' చిత్రం విడుదల కానుందని వెల్లడించింది. ప్రభాస్ ప్రమోషన్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.