జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్
- ఈ వ్యాధి లక్షణాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల
- ఒకప్పుడు విమర్శించిన ప్రాజెక్టులకు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపణ
- కియా, గూగుల్ డేటా సెంటర్ వంటి పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన లోకేశ్
క్రెడిట్ చోరీ డిజార్డర్ లక్షణాలు ఇలా ఉంటాయి అనే వాక్యంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్, కియా మోటార్స్, భోగాపురం విమానాశ్రయం, బల్క్ డ్రగ్ పార్క్ వంటి పలు కీలక ప్రాజెక్టులను జగన్ తీవ్రంగా విమర్శించిన క్లిప్పింగులను ఈ వీడియోలో చూపించారు. ఆ తర్వాత, అవే ప్రాజెక్టులు పూర్తయ్యాక వాటిని తానే తెచ్చానంటూ జగన్ క్రెడిట్ తీసుకోవడాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించారు. మధ్యమధ్యలో ‘జగన్... నవ చోరీలు...’ అనే కార్టూన్‌ను కూడా జత చేశారు.