వాలీబాల్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'బరి'... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
- 'బరి' టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా
- తొలిసారిగా అన్న వరుణ్ తేజ్‌తో సినిమా నిర్మిస్తున్న నిహారిక కొణిదెల
- 'కమిటీ కుర్రాళ్లు' ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామా
- పాన్ ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ వేడుక జరిగింది. ఈ సినిమాకు వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కమిటీ కుర్రాళ్లు' చిత్రంతో గుర్తింపు పొందిన యదువంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలోని వాలీబాల్ క్రీడ ఆధారంగా ఈ సినిమాను హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ సినిమా షూటింగ్లో చివరి దశలో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే 'బరి' చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.







