నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్
- 'డెకాయిట్' చిత్రం ప్రమోషన్స్ లో అడివి శేష్ వ్యాఖ్యలు
- ఉదయాన్నే షూటింగ్ అంటే చాలా భయంగా ఉంటుందని వెల్లడి
- చిన్నపాటి చిట్కాలతో నెట్టుకొస్తుంటానని వివరణ
"నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్యలున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే షూటింగ్ మొదలయ్యే ముందు చాలా భయంగా ఉంటుంది. ఆ సమయం నాకు చాలా గందరగోళంగా గడుస్తుంది. దీని నుంచి బయటపడటానికి అరోమాథెరపీ, కళ్లపై ఐస్ పెట్టుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాను. ఇవి నాకు అలవాట్లుగా మారిపోయాయి" అని శేష్ వివరించారు.
నటనకు ముందు మానసికంగా ఎలా సిద్ధమవుతారో కూడా ఆయన తెలిపారు. "ఏదైనా భావోద్వేగమైన సన్నివేశంలో నటించాల్సి వస్తే, ముందు రోజు రాత్రి నుంచే నా ఎమోషన్స్‌ను ఆ మూడ్‌కు తగ్గట్టుగా మార్చుకుంటాను. ఉదాహరణకు, కోపంగా నటించాల్సిన సన్నివేశం ఉంటే, ఆ రోజు ఉదయం ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటాను. తద్వారా పాత్రకు అవసరమైన నిజమైన భావోద్వేగాన్ని తెరపైకి తీసుకురాగలుగుతాను" అని శేష్ తన నటనలోని రహస్యాన్ని పంచుకున్నారు.