రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
- శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరాముడు ప్రతీక అని వ్యాఖ్య
- ప్రజారంజక పాలన అందించే రామరాజ్యాన్ని స్థాపిద్దామని పిలుపు
- శ్రీరాముడి సుగుణాలతో ఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్ష
ఈ సందర్భంగా ఆయన ఒక సందేశం విడుదల చేశారు. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన అని, రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రమూర్తి చూపిన బాటలో పయనిస్తూ, ఆయన సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముడి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.