బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం
- నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం
- ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం
- ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
- షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం
ఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బాలకృష్ణతో పాటు సీనియర్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా జీవితకాల సాఫల్య పురస్కారాలను ప్రకటించారు. ధర్మేంద్ర తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించారు.
ఈ వేడుకలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాలకృష్ణకు ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.