హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!
- ఇంధన కొరతతో తాత్కాలికంగా మూతబడిన పెట్రోల్ బంకులు
- హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్లలోని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
- తెరిచి ఉన్న బంకుల్లో బారులుతీరిన వాహనదారులు
సోమాజిగూడ, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లోని పెట్రోలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు పెట్రోల్ బంకులు తాత్కాలికంగా తెరుచుకోవడం లేదు. తెరిచి ఉన్న బంకుల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు.
యుద్ధానికి ముందు చమురు రంగ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, కానీ ఇటీవల ఇవ్వడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టాక్ కావాలంటే అడ్వాన్స్ కడితేనే వస్తుందని చెబుతున్నారు. కాగా, ఇరాన్‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా ట్రంప్ ప్రకటనకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.