‘ధురంధర్ 2’ ఏఐ పోస్టర్‌తో వివాదం.. రణవీర్ సింగ్‌పై సిక్కుల ఫిర్యాదు
- సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపణలు
- పోస్టర్‌లో మత చిహ్నాలను అగౌరవపరిచారని మండిపడ్డ సంఘాలు
- ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించని నటుడు రణవీర్ సింగ్
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్‌లో రణవీర్ సింగ్ ‘కిరాత్‌పూర్ సింగ్’ అనే సిక్కు యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. అయితే, ఏఐతో రూపొందించిన ఈ చిత్రంలో సిక్కు గురువుల చిత్రాలను, పవిత్ర మత చిహ్నాలను అగౌరవపరిచే విధంగా ఉపయోగించారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తమ చరిత్ర, సంస్కృతి, మత విశ్వాసాలతో ఆటలాడటం సరికాదని, ఇది సమాజంలో అనవసర ఘర్షణలకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదులో కేవలం రణవీర్ సింగ్ తో పాటు సినిమా దర్శక నిర్మాతలు కూడా బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని సిక్కు సంఘాల ప్రతినిధులు కోరారు. అయితే, ఈ వివాదంపై రణవీర్ సింగ్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.