ఇది సినిమా కాదు... రీసెట్ బటన్: ధురంధర్-2పై రామ్ గోపాల్ వర్మ
- ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురందర్ ది రివెంజ్
- మార్చి 19న వరల్డ్ వైడ్ రిలీజ్
- మరోసారి మ్యాజిక్ చేసిన రణవీర్, ఆదిత్య ధర్ కాంబో
- మార్చి 19కు ముందు తీసిన సినిమాలన్నింటినీ మరిచిపోవాల్సిందేనన్న వర్మ
- లేకపోతే ఫిల్మ్ మేకర్స్ మూర్ఖులవుతారని వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఇతర ఫిల్మ్ మేకర్స్‌ను ఉద్దేశిస్తూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "2026 మార్చి 19కు ముందు తీసిన సినిమాలన్నింటినీ మరిచిపోకపోతే ఫిల్మ్ మేకర్స్ మూర్ఖులవుతారు. ఆ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ తమ సినిమాలను 'ధురంధర్ 2'తో పోల్చుకోవాలి. లేదంటే దాని అగ్నిలో కాలి బూడిదైపోతారు" అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు.
రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన ధురంధర్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ ది రివెంజ్ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజై... బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారతీయ సినీ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకెళుతోంది.