ఐఏఎస్ అధికారి డాక్టర్ నీలకంఠ రెడ్డిపై బదిలీ వేటు.. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి
- ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ బాధ్యతల నుంచి ఉపసంహరణ
- సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఆదేశం
- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి ఇన్ఛార్జ్ను నియమించాలని ఆదేశాలు
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖాళీ అయిన ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుకు అవసరమైన ఇన్‌ఛార్జ్ ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.