ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ
- 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు
- సినిమా సహజంగా, ఆకట్టుకునేలా, ప్రభావవంతంగా ఉందని వ్యాఖ్య
- రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతమన్న గ్లోబల్ స్టార్
- దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను కొనియాడిన చరణ్
- చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపిన మెగా పవర్‌స్టార్
దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, భావోద్వేగాలను, భారీతనాన్ని చక్కగా మిళితం చేశారని కొనియాడారు. ప్రధాన పాత్రలో నటించిన రణ్‌వీర్ సింగ్ అత్యద్భుతమైన నటన కనబరిచారని, తన తీవ్రతతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేశారని కితాబిచ్చారు. నటులు మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని ప్రశంసించారు.
సారా అర్జున్ నటన అద్భుతమని, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సినిమా స్థాయిని పెంచిందని వివరించారు. ఇంత మంచి సినిమాను నిర్మించి, భారతీయ సినిమాలో ఒక గొప్ప చిత్రంగా నిలిపినందుకు జియో స్టూడియోస్, జ్యోతి దేశ్‌పాండేలను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి రామ్ చరణ్ తన శుభాకాంక్షలు తెలిపారు.