రంజాన్ సెలవు 21వ తేదికి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్
- ఏపీలో రంజాన్ సెలవు తేదీలో మార్పు
- శుక్రవారానికి బదులుగా శనివారం సెలవుగా ప్రకటన
- నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి
- శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని
గురువారం నెలవంక కనిపించని నేపథ్యంలో, పండుగను శనివారం జరుపుకోనున్నట్లు ఏపీ వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి తెలియజేసింది. వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ మార్పు చేసినట్లు సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్-1881 కింద నమోదైన షాపులు, ఇతర సంస్థలకు కూడా వర్తిస్తుందని మరో జీవోలో తెలిపారు.