'ధురంధర్ 2' .. అదే దూకుడు!
- ఈ రోజునే విడుదలైన 'ధురంధర్ 2'
- అదే యాక్షన్ .. అంతే ఎమోషన్
- అక్కడక్కడా నిదానించిన కంటెంట్
- హైలైట్ గా నిలిచే రణ్ వీర్ యాక్షన్
- రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్
భారత్ ను దెబ్బకొట్టడానికి పాకిస్థాన్ వ్యూహాలు పన్నడం .. ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి సీక్రెట్ ఏజెంట్ గా హీరో ఆ దేశంలో అడుగుపెట్టడం .. అక్కడ ఆయనకి ఎదురైన పరిస్థితులతో ఫస్టు పార్టు సాగుతుంది. హీరోకి జరిగిన అన్యాయం .. అందుకు సంబంధించిన ప్రతీకారంతో సీక్వెల్ మొదలవుతుంది. ఫస్టు పార్టుకి ఏ మాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉందనే టాక్ థియేటర్స్ దగ్గర బలంగా వినిపిస్తోంది. కంటెంట్ పై గల నమ్మకంతో 4 గంటల నిడివితో ఈ సినిమాను వదలడం విశేషం.
'ధురంధర్ 2'లో ఫస్టాఫ్ ఓ మాదిరిగా అనిపించినప్పటికీ, సెకండాఫ్ లో కథ పుంజుకుందని చెబుతున్నారు. దేశభక్తితో కూడిన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయని అంటున్నారు. అక్కడక్కడా కాస్త నిదానించినప్పటికీ, ఆ తరువాత వచ్చే ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు థియేటర్స్ ను ఊపేస్తున్నాయని చెబుతున్నారు. రణ్ వీర్ సింగ్ తన పాత్రలో జీవించాడనీ, సీక్వెల్ కూడా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.