మరీ ఇంత నిర్లక్ష్యమా.. యూపీలో నడి రోడ్డులో చేతిపంపు.. వీడియో ఇదిగో!
- యూపీ మీర్జాపూర్లో అధికారుల వింత చర్య
- రోడ్డు మధ్యలో చేతిపంపును వదిలేసి నిర్మాణం
- సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెల్లువెత్తిన విమర్శలు
- విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
అయితే, రోడ్డు మధ్యలో ఉన్న చేతిపంపును తొలగించకుండా, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు దాని చుట్టూనే కాంక్రీట్ వేసి పనులు ముగించేశారు. దీంతో ఆ పంపు ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా, ప్రమాదకరంగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు దీనిని గమనించకపోతే ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అధికారుల పనితీరుపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘రోడ్డుపై వెళ్తూనే దాహం తీర్చుకోవచ్చు’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రజల భద్రతను గాలికొదిలిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేతిపంపును తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.