'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!
- మరికొన్ని గంటల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్
- పవన్- హరీశ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ
- అంచనాలు పెంచుతున్న కంటెంట్
- విలన్ పాత్రను పోషించిన పార్తీబన్
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు, కొంతకాలంగా తెలుగులో విలన్ రోల్స్ చేస్తూ వెళుతున్నారు. పవర్ఫుల్ విలన్ గా తెలుగు తెరపై కనిపించడానికి వాళ్లు ఎంతమాత్రం వెనకాడటం లేదు. ఆ జాబితాలో అర్జున్ .. అరవింద్ స్వామి .. విజయ్ సేతుపతి వంటి స్టార్స్ కనిపిస్తున్నారు. తాజాగా ఆ వరుసలోకి పార్తీబన్ చేరిపోయాడు. తమిళంలో సీనియర్ హీరోగా .. దర్శక నిర్మాతగా పార్తీబన్ కి మంచి ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ జనరేషన్ తెలుగు ఆడియన్స్ కి పార్తీబన్ అంతగా తెలియదు. ఎందుకంటే నేరుగా ఆయన తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. తమిళ సినిమాల అనువాదాలు ద్వారానే ఆయన ఇక్కడి ఆడియన్స్ కి తెలుసు. అలాంటి పార్తీబన్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్రను హరీశ్ శంకర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట. ఈ పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. విలక్షణమైన విలనిజంతో పార్తీబన్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి మరి.