దేవుడే మనిషిని సాయం కోరితే.. ఓటీటీలో మలయాళం మూవీ
- ఫాంటసీ టచ్ తో సాగే కంటెంట్
- క్రితం ఏడాది థియేటర్లలో విడుదల
- ఈ నెల 20వ తేదీ నుంచి 'మనోరమా మ్యాక్స్'లో
అందరికీ సాయం చేసే దేవుడు, తనకి సాయపడమని ఒక మనిషిని కోరడమనే ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్'. సైజూ కురుప్ - సన్నీ వేన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఫెబీ జార్జ్ దర్శకత్వం వహించాడు. థామస్ జోస్ నిర్మించిన ఈ సినిమా, క్రితం ఏడాది జూన్ 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. కొన్ని కారణాల వలన కాస్త ఆలస్యంగా ఈ సినిమా 'మనోరమా మ్యాక్స్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో కథానాయకుడు తన కెరియర్ విషయంలో చాలా అసంతృప్తితో ఉంటాడు. అతని వైవాహిక జీవితం కూడా సమస్యల్లో ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అతనికి మనిషి రూపంలోని దేవుడు ఎదురవుతాడు. సమస్యల్లో ఉన్న మనిషిని దేవుడే ఓ సాయం అడుగుతాడు. ఆ సాయం ఏమిటి? అది విన్న కథానాయకుడు ఎలా స్పందిస్తాడు? అప్పటి నుంచి అతని జీవితం ఎలా మారిపోయింది? అనేది కథ.