హైదరాబాద్‌లోని ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌లో కుళ్లిన 610 కిలోల చికెన్ పట్టివేత
- ముషీరాబాద్‌లోని చికెన్ మార్ట్‌లో పోలీసుల తనిఖీలు
- షేక్ షకీల్ అనే వ్యక్తి కుళ్లిన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న వారాసిగూడ పోలీసులు
తనిఖీల సందర్భంగా మాంసం దుర్వాసన రావడంతో పాటు ఎలుకలు, పిల్లులు సంచరించే అపరిశుభ్రత ప్రాంతంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా చికెన్ దుకాణం దుకాణ లైసెన్స్‌ను తనిఖీ చేయగా, గడువు ముగిసి ఏడాది దాటినా రెన్యూవల్ చేసుకోలేదని గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.