పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు.. ఒత్తిడి వద్దని సూచన
- ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచన
- ప్రణాళికాబద్ధంగా రాస్తే విజయం మీదేనని భరోసా
- సోషల్ మీడియా వేదికగా విద్యార్థులను ఉత్సాహపరిచిన మంత్రి లోకేశ్
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని లోకేశ్ సూచించారు. ‘ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కాగా, మార్చి 16న ప్రారంభమైన ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.