మీ సలహాలు స్వీకరిస్తాం.. సభకు రండి: కేసీఆర్‌కు కోమటిరెడ్డి విజ్ఞప్తి
- కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న మంత్రి కోమటిరెడ్డి
- ప్రతిపక్ష నేతగా సభకు రాకపోవడం సరికాదంటూ వ్యాఖ్య
- ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వాగతిస్తామని వెల్లడి
ప్రజలు మార్పు కోరుకునే కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ఆ తీర్పును స్వాగతించాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వ పనితీరుపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. "మా పనిలో ఏవైనా తప్పులుంటే చెప్పండి, తప్పకుండా మార్చుకుంటాం. కానీ, అసెంబ్లీకే రాకపోవడం సరికాదు," అని హితవు పలికారు.
ఇటీవల కేసీఆర్ సభకు ఒక్క నిమిషం మాత్రమే హాజరై, గవర్నర్ ప్రసంగం ముగియకముందే వెళ్లిపోవడం, మరణించిన సభ్యులకు సంతాపం తెలిపేంత వరకు కూడా ఉండకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ప్లోరైడ్ తో నల్లొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే వారి జీవితాలు కూడా బాగుపడతాయని మంత్రి పేర్కొన్నారు.