పార్టీ ఫిరాయింపులు... రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం
- ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడతామని మేనిఫెస్టోలో పెట్టారన్న హరీశ్ రావు
- రాజ్యాంగ రక్షణ అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమా అని ఎద్దేవా
ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. అలాగే రాహుల్ గాంధీ కూడా దేశమంతా నీతిసూత్రాలు చెబుతున్నారని అన్నారు. కానీ తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడమే రాజ్యాంగాన్ని రక్షించడమా అని ఎద్దేవా చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవకాశవాదం కోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.