న్యూయార్క్ మేయర్‌నే నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్‌ను నియమిస్తారా?: ఇరాన్ మంత్రి చురక
- సుప్రీం లీడర్ ఎంపికలో తన ప్రమేయం ఉండాలన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మంత్రి విమర్శ
- అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నామన్న విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్
- పశ్చిమాసియా దేశాల్లో ప్రజలకు నష్టం చేయడం లేదని వెల్లడి
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇటీవల మమ్దానీ ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మమ్దానీ అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించే వ్యక్తి అని పేర్కొన్నారు. "న్యూయార్క్ మేయర్‌ను నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్‌ను నియమిస్తారా" అని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్, అమెరికాలపై తన దేశం చేపడుతున్న చర్యలను ఆయన సమర్థించారు. అమెరికా ఆస్తులే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై తాము దాడులు చేస్తున్నామని, ఈ దాడుల వల్ల ఆ దేశాల్లోని ప్రజలకు ఎలాంటి నష్టం చేయడం లేదని తెలిపారు. అగ్రరాజ్యం ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనాను అమెరికా ముంచివేసిన ఘటనపై కూడా ఆయన స్పందించారు. భారత స్నేహితుల ఆహ్వానం మేరకు ఆ నౌక ఇక్కడకు వచ్చిందని, దానిపై అమెరికా దాడి చేయడం దురదృష్టకరమని అన్నారు.