మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి... హీరోలు వీరే!
- అనిల్ రావిపూడి నుంచి మరో మల్టీస్టారర్ ప్రకటన
- హీరోలుగా విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్
- 2027 సంక్రాంతికి సినిమా విడుదల అని వెల్లడి
- తన తొలి హీరో, బ్లాక్‌బస్టర్ హీరోతో సినిమా చేస్తున్నట్లు ట్వీట్
చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ తర్వాత కొంతకాలంగా అనిల్ రావిపూడి తదుపరి చిత్రంలో వెంకటేష్‌తో పాటు మరో హీరో ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటికీ తెరదించుతూ కల్యాణ్ రామ్ పేరును ఖరారు చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "నాకు మొదటిసారి 'బొమ్మ' తీసే అవకాశం ఇచ్చిన హీరో కల్యాణ్ రామ్‌తో, నా మొదటి 'వందకోట్ల బొమ్మ' కొట్టిన హీరో వెంకటేష్ గారితో కలిసి 2027 మొదటి పండక్కి మీ ముందుకు వస్తున్నాం" అని పేర్కొన్నారు.