చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం
- అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్
- గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు
- ఆర్టీజీఎస్‌ను సందర్శించనున్న బిల్ గేట్స్
ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్‌కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.
.