చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు
- చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన ఓ వ్యక్తి
- వీరిపై దుష్ప్రచారం చేసినట్టు పోలీసులకు అందిన ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ... సోషల్ మీడియా ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసత్య ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ప్రముఖుల ఫొటోలను ఎడిట్ చేసి, అసభ్యకరంగా చిత్రీకరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.