పవన్ కల్యాణ్‌ను కలిసిన నందమూరి బాలకృష్ణ, నాగబాబు!
- ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వక భేటీ
- పవన్ కల్యాణ్‌తో మొదట బాలకృష్ణ, ఆ తర్వాత నాగబాబు సమావేశం
- గిద్దలూరు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతిపత్రం అందజేత
అంతకుముందు, శాసనసభలో మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ ఏదో చెబుతుండగా లోకేశ్ ఆసక్తిగా వింటున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా, గిద్దలూరు నియోజకవర్గం సమస్యలపై పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.