పార్టీ లైన్ దాటితే చూస్తూ ఊరుకోబోం.. కొలికపూడికి పల్లా వార్నింగ్
- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలిపై విమర్శలు
- అసెంబ్లీ లాబీలో కొలికపూడితో మాట్లాడిన పల్లా శ్రీనివాస్
- పార్టీతోనే గుర్తింపు, వ్యక్తిగతంగా జీరో అని గుర్తించాలంటూ హితవు
పార్టీ లైన్ దాటితే ఉపేక్షించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను కొలికపూడికి తెలియజేశారు. వాట్సప్ స్టేటస్ లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని పల్లా ఆయనను నిలదీశారు. మందలించినా కూడా పద్ధతి మార్చుకోకుంటే పార్టీ ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని స్పష్టం చేశారు. కాగా, అనుభవరాహిత్యం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు.