తెలుగు తెరపై అందమైన వారసత్వం .. ఐశ్వర్య అర్జున్!
- తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్య అర్జున్
- ఈ నెల 14న విడుదలవుతున్న 'సీతా పయనం'
- టైటిల్ పరంగా మంచి మార్కులు
- దర్శకుడిగా వ్యవహరించిన అర్జున్
అలాంటి హీరోయిన్స్ జాబితాలో ఇప్పడు అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా చేరిపోయింది. ఐశ్వర్య 2013లోనే ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరియర్ ను ఆమె సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించలేదు. తమిళ .. కన్నడ భాషల్లో మాత్రమే రెండు మూడు సినిమాలు చేసిన ఆమె, ఇప్పుడు 'సీతా పయనం' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
ఇది ప్రేమకథా చిత్రం .. ఈ సినిమాకి అర్జున్ దర్శకత్వం వహించడం విశేషం. తండ్రి దర్శకత్వంలో లవ్ స్టోరీస్ చేయవలసి రావడం నిజానికి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే. అయినా అర్జున్ ను ఒక దర్శకుడిగా మాత్రమే భావిస్తూ ఐశ్వర్య ఈ సినిమా చేసింది. గ్లామర్ పరంగా ఐశ్వర్యకి వంక బెట్టాల్సిన అవసరం లేదు. మరి నటన పరంగా ఎన్ని మార్కులు పడతాయనేది చూడాలి. అర్జున్ చాలా కసరత్తు చేసి తీసిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.