మాదాపూర్ ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
- మాదాపూర్ ఎస్సై వినయ్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ
- రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- నగదును సీజ్ చేసిన అధికారులు
వివరాల్లోకి వెళితే, ఓ కేసు విషయంలో సహకారం అందిస్తానంటూ ఫిర్యాదుదారుడి నుంచి వినయ్ రూ. 50 వేలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న తరుణంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నగదును సీజ్ చేశారు. ఎస్సై వినయ్ ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.