'లాహోర్ 1947' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
- ఆమిర్ ఖాన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'లాహోర్ 1947'
- కీలక పాత్రలు పోషిస్తున్న సన్నీ డియోల్, షబానా అజ్మీ, ప్రీతి జింటా తదితరులు
- ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 'గదర్ 2' వంటి భారీ హిట్ తర్వాత సన్నీ డియోల్ నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ ఫుల్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది.