ఉక్కిరిబిక్కిరి చేసే మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ .. ఓటీటీలో!
- కీలక పాత్రల్లో మీనా - వినీత్
- ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- 4 భాషల్లో అందుబాటులోకి
ఈ సిరీస్ కి వినాయక్ శశికాంత్ కథను అందించారు. సుమేశ్ నందకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి, 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. దాంతో ఈ సిరీస్ అనూహ్యమైన మలుపులతో పరుగులు పెడుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మీనా .. వినీత్ .. బేబీ సంజన ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 'జియోహాట్ స్టార్' లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
కథలోకి వెళితే ..'రోస్లిన్' అనే ఒక పాప చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రలోకి జారుకోగానే ఆ పాపకి ఒక పీడకల వస్తూ ఉంటుంది. కలలో ఒక చిత్రమైన వ్యక్తి ఆమెను వెంటాడుతూ ఉంటాడు. దాంతో ఆ పాప నిద్రపోవడానికి భయపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పాప పరిస్థితి పట్ల ఆందోళన చెందుతారు.'రోస్లిన్'కి ఆ కల ఎందుకు వస్తోంది? కలలో ఆమెకి కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అనేది మిగతా కథ.